ప్రక్రియ లోపభుయిష్టమన్న జైరాం రమేశ్.
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సెన్సెస్ 2027 ప్రక్రియ పూర్తిగా పక్కదారి పట్టిందని, దాని ఉద్దేశం చాలా అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. కొన్ని ప్రశ్నలు పూర్తిగా అనవసరంగా, మరికొన్ని నిరుపయోగంగా, ఇంకొన్ని ప్రమాదకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కులగణనలో డ్రాప్‌డౌన్ జాబితా స్థానంలో వ్యక్తులు స్వయంగా సమాధానం ఇచ్చే ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు పెట్టడాన్ని కాంగ్రెస్ ఇప్పటికే తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి విధానం కులగణన డేటా నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. కులానికి సంబంధించిన ప్రశ్నతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాల సమాచారాన్ని మళ్లీ సేకరించడం వంటి అంశాలపై కూడా జైరాం రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్పీఆర్, ఎన్ఆర్సీపై కొత్త సందేహాలు
ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో జనాభా లెక్కల ప్రక్రియను ముందుకు తీసుకురావడం, కొత్త ప్రశ్నలను చేర్చడంపై మాజీ జనగణన అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు వచ్చిన మీడియా కథనాన్ని ప్రస్తావిస్తూ జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సేకరించే సమాచారం నాణ్యత, గోప్యతపై మాజీ అధికారులు ప్రశ్నలు లేవనెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. జనగణనకు సంబంధించిన వివరాలు భవిష్యత్తులో జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌరుల రిజిస్టర్‌తో అనుసంధానమయ్యే అవకాశాలపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రస్తుత కులగణన ప్రశ్నావళిని రద్దు చేసి, సరైన విధానంలో కులగణన నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. మొత్తం ప్రక్రియపై కాంగ్రెస్ వరుసగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో సెన్సస్ 2027పై రాజకీయ వివాదం మరింత ముదురుతోంది.
#Census2027 #CasteCensus #Census2027Controversy #JairamRamesh #Congress #CongressParty #CasteCensusIndia #CensusQuestionnaire #CensusProcess #CensusData #DataPrivacy #DataQuality #NPR #NRC #NationalPopulationRegister #NationalRegisterOfCitizens #MallikarjunKharge #RahulGandhi #NarendraModi #CongressVsBJP #PoliticalControversy #IndiaPolitics #IndiaNews











