Home Celebrity ఆలపాటి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు చంద్రబాబు

ఆలపాటి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు చంద్రబాబు



విజయవాడలో జరిగిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ గారి కుమారుడు చార్వాక వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులు చార్వాక, సింధురాణిలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వధూవరులతో కొద్దిసేపు మాట్లాడిన ముఖ్యమంత్రి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను పలకరించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రాకతో వివాహ రిసెప్షన్‌లో సందడి నెలకొంది. ఆలపాటి సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు సీఎంకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు, ప్రముఖులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

 

#ChandrababuNaidu #AlapatiSureshKumar #Charvaka #Sindhurani #WeddingReception #Vijayawada #APPressAcademy #AndhraPradeshCM #AndhraPradeshNews #Chandrababu #WeddingEvent #VijayawadaEvents