Home Cinema_News విజయ్ బర్త్‌డే..రణబాలి నుంచి గ్లింప్స్ విడుదల

విజయ్ బర్త్‌డే..రణబాలి నుంచి గ్లింప్స్ విడుదల

2
Ranabali

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ’రణబాలి’ చిత్ర బృందం అదిరిపోయే కానుకను అందించింది. విజయ్‌కి బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త గ్లింప్స్‌ను పంచుకుంది చిత్రయూనిట్. టాక్సీవాలా వంటి ఘనవిజయం తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే ఇండస్టీల్రో భారీ అంచనాలు నెలకొన్నాయి. 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న ’జయమ్మ’ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తుండగా, వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఫ్యాన్స్‌లో క్రేజ్ రెట్టింపు అయింది. ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ’ది మమ్మి’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ, సర్ థియోడర్ హెక్టర్ అనే బ్రిటిష్ అధికారిగా విలన్ పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు టి`సిరీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అజయ్`అతుల్ సంగీతాన్ని అందిస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.