Home Cinema_News రౌడీ జనార్ధన్ నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదల

రౌడీ జనార్ధన్ నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదల

4
Roudi Janardhan Movie

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే కానుక అందించింది. యువ దర్శకుడు రవికిరణ్ కోల దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ’రౌడీ జనార్థన్. వరుస సినిమాలతో, విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకువస్తున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న చిత్రం ’రౌడీ జనార్దన’. విజయ్ పుట్టినరోజు సందర్భంగా టీమ్ ప్రత్యేక పోస్టర్ పంచుకుంది. ఇప్పటివరకూ విజయ్ సీరియస్ లుక్‌లో ఉన్న ఫొటోలు పంచుకున్న చిత్రబృందం తాజాగా ఓ లవ్లీ పోస్టర్‌ను షేర్ చేసింది. ’ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు’ అంటూ విజయ్‌కు విషెస్ తెలిపింది. ఇందులో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ కనిపించనున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఆయన ఇందులో విజయ్ పాత్ర గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘విజయ్ దేవరకొండ ఇప్పటివరకు విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, ఇలాంటి పూర్తిస్థాయి మాస్ పాత్ర ఇంతవరకు చేయలేదు. తొలిసారి ఈ సినిమాలో తనతో తూర్పుగోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. ఈ కథ విన్నప్ప్పుడే నాకు చాలా వినూత్నంగా అనిపించింది. 80వ దశకం నేపథ్యంలోని ప్రపంచాన్ని మా సాంకేతిక నిపుణులంతా అద్భుతంగా పునఃసృష్టించారు‘ అని తెలిపారు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ ఇంటెన్స్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అతడి గుండెపై హీరోయిన్ కాలుపెట్టగా.. ప్రపంచంతో పోరాడే మొండివాడు.. కానీ ప్రేమకు మాత్రమే తలవంచుతాడు అంటూ ఈ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు.